తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉంది. ఆయన తమిళ్‌లో నటించిన రెమో, డాక్టర్‌ వరుణ్‌, డాన్‌, ప్రిన్స్‌ వంటి చిత్రాలు తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.అంతేగాక శివ కార్తికేయన్ కు రజినీకాంత్, సూర్య, విక్రమ్ లాగా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ ఇటీవలే 'అయలాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్‌ అయిన ఈ చిత్రం తమిళనాడులో మంచి విజయం సాధించింది. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా రిలీజైంది. టాలీవుడ్ లో సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. ఇక రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న తెలుగులో విడుదల కాబోతుంది.


సినిమా అప్పుడే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ త్వరలోనే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుందట. ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్‌ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ కానున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయలాన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం తెలిసింది.ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. కానీ ఆ సెక్వెల్ లో మాత్రం రకుల్ యాక్ట్ చెయ్యట్లేదని మొహమాటం లేకుండా చెప్పేసిందట.దీంతో రకుల్ పై తమిళ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఈ మూవీకి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు.ఇంకా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: