మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ తన మొదటి సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమూవీ కమర్షియల్ గా పెద్దగా సక్సస్ అవ్వనప్పటికీ మంచు లక్ష్మికి నటిగా చాల మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమూవీలోని ఆమె నటనకు నందీ ఫిలిమ్ ఫేర్ అవార్డులు కూడ వచ్చాయి. ఆతరువాత ఆమె ‘గుండెల్లో గోదారి’ ‘దొంగాట’ లాంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది కానీ ఆసినిమాలు ఏవీ ఆమె కెరియర్ కు పెద్దగా సహకరించలేదు.ఓటీటీ ఛానల్స్ లో కూడ ఆమె తనవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆప్రయత్నాలు కూడ ఆమె కెరియర్ కు ఏమాత్రం సహకరించలేదు. దీనితో కొంతకాలం నుండి ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమధ్య తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఒక థ్రిల్లర్ మూవీని తీయబోతున్నట్లు ప్రకటించినప్పటికీ కొన్ని కారణాలతో ఆమూవీ ప్రాజెక్ట్ కు ముందుకు సాగలేదు.అయితే ఆమె ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ ఒక సంచలన చిత్రాన్ని ప్రకటించింది. ఆసినిమా పేరు ‘ఆదిపర్వం’ ఎర్రగుడి కథ అన్నది ట్యాగ్ లైన్. ఈమధ్యనే ఈసినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో లీకు చేశారు. సంజీవ్ మెగొటీ అన్న కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఈమూవీ టాప్ హీరోల సమ్మర్ మధ్య విడుదల అవుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.ఈసినిమాకు టెక్నికల్ టీమ్ లో అంతా కొత్త వాళ్ళే పనిచేస్తున్నారు. 1990 ప్రాంతంలో ఇలాంటి దేవత గుడి కథలతో చాల సినిమాలు వచ్చేవి. అయితే నేటితరం వారికి ఆనాటి ట్రెండ్ ను పరిచయం చేస్తూ మంచు లక్ష్మీ ఈ ‘ఆదిపర్వం’ మూవీని నిర్మిస్తున్నట్లు అనిపిస్తోంది. లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించి విడుదలచేసిన పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన స్టిల్స్ లో మంచు లక్ష్మీ చాల ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఈసినిమా పై అంచనాలు పెంచుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: