మరో రెండు నెలలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో తెలుగు రాష్ట్రాలు మీడియా ఎన్నికల వేడితో వేడెక్కిపోతున్నాయి. ఈఎన్నికలలో పాల్గొనే రాజకీయ పార్టీలు అన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతూ రకరకాల మాటల వాగ్దానాలు చేస్తూ జనం మధ్యకు వెళుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఈనెలలో అదేవిధంగా వచ్చే నెలలో విడుదల కాబోతున్న కొన్ని ఎన్నికల సినిమాల పై ఆశక్తి పెరుగుతోంది. ఈ లిస్టులో ప్రధమ స్థానంలో ఉన్నది ‘యాత్ర 2’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చేసిన పాదయాత్ర ను హైలెట్ చేస్తూ తీసిన ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈమూవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలలో జగన్ ఇమేజ్ ని మరింత పెంచుతుందని అంచనాలు వస్తున్నాయి. ఈసినిమా విడుదలైన వారం రోజులకు నారా రోహిత్ నటించిన ‘రాజాధాని ఫైల్స్’ విడుదల కాబోతోంది. అమరావతి రైతుల వ్యధలను ఆధారంగా చేసుకుని తీయబడ్డ ఈమూవీలో పొలిటికల్ సెటైర్లు చాల ఎక్కువగా ఉంటాయని లీకులు వస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టు టివి5 మూర్తి ఈమూవీకి దర్శకత్వం వహించడం మరింత సంచలనంగా మారింది.  ఈసినిమా ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ఓటరు ను ప్రభావితం చేస్తుంది అన్న విషయం క్లారిటీ లేకపోయినా ఈమూవీ గురించి చాలామంది మాట్లాడుకునే ఆస్కారం ఉంది. ఈ రెండు మూవీల పరిస్థితి ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ కోర్టు సమస్యల నుండి బయటపడి ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల లోపు విడుదల అయితే ఆసినిమా మరిన్ని రాజకీయ ప్రకంపలను సృష్టించే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇలా ఈమూడు సినిమాలు జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఓట్లు వేయబోయే ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అన్న విషయమై స్పష్టత లేకపోయినా ఈమూడు సినిమాలు చేయబోయే హడావిడి మాత్రం మీడియంకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు ముదురుతున్న ఈ ఎండల మధ్య మరింత రాజకీయ వేడిని సృష్టించడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  మరింత సమాచారం తెలుసుకోండి: