మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్సా ఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నాలుగు రోజుల్లో డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే రోజు వారిగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.87 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 96 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి మొత్తంగా ఈగల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.66 కోట్ల షేర్ ... 19.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించగా ... ప్రముఖ సినిమాటో గ్రాఫర్ అయినటువంటి కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కథ , కథనాలు రొటీన్ గానే ఉన్నప్పటికీ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: