టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువక్నటులలో అభినవ్ గోమఠం ఒకరు. ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం అలాగే ఇందులో ఈయన తన అద్భుతమైన నటనతో , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈయనకు వరుసగా తెలుగు లో సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటి వరకు అనేక సినిమాలలో కమీడియన్ పాత్రలలో మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు తాజాగా "మస్తు షేడ్స్ ఉన్నాయిరా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 23 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదిక ను ఖరారు చేస్తూ అలాగే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రకటించింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ లాబ్స్ లాన్ ..  హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు ఈ ఈవెంట్ కి టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: