తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాని ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అందులో భాగంగా నాని పోయిన సంవత్సరం దసరా ... హాయ్ నాన్న అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా పాన్ ఇండియా మూవీ లుగా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. 

లా వరుసగా రెండు పాన్ ఇండియా విజయాలను అందుకున్న నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్యమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీని ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది. 

మరి ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారో అనే విషయం క్లారిటీగా తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లీమ్స్ వీడియోను ఫిబ్రవరి 24 వ తేదీన అనగా శనివారం రోజు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క గ్లిమ్స్ వీడియోను 24 వ తేదీన శనివారం రోజు ఉదయం 11 గంటల 59 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: