అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సుహాస్ హీరోగా నటించిన ఈ విలేజ్ కామెడీ యాక్షన్ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ మూవీకి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లను దక్కించుకుంది. మరోవైపు, బిగ్‍బాస్ ఫేమ్ సోహెల్ నటించిన బూట్‍కట్ బాలరాజు సినిమా కూడా ఫిబ్రవరి 2నే థియేటర్లలో విడుదలైంది. అయితే, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఒకే రోజున ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానున్నాయని తెలుస్తోంది.అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు సినిమాలో మల్లిగాడు అలియాజ్ మల్లికార్జున పాత్రలో సుహాస్ అదరగొట్టారు. తన టాలెంట్‍ను మరోసారి నిరూపించుకున్నారు. కామెడీనే కాకుండా ఇంటెన్స్ సీన్లలోనూ మెప్పించారు. ఈ చిత్రానికి దుష్యంత్ కటికకేని దర్శకత్వం వహించారు. సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్‍గా చేశారు. శరణ్య ప్రదీప్‍ది కూడా ఈ మూవీలో ప్రధాన పాత్రగా ఉంది.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా ఓటీటీ హక్కులను ఆహా ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఆహా ఓటీటీలో మార్చి 1వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీలో గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ బండారీ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్స్, మహయానా మోషన్ పిక్చర్స్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

2007 కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో అంబాజీపేట మ్యారేజ్‍బ్యాండు మూవీ నడుస్తుంది. కులం అంశం కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది. హార్డ్ హిట్టింగ్ మూవీగా ఈ చిత్రం వచ్చింది.బిగ్‍బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా చేసిన బూట్‍కట్ బాలరాజు చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకులు రాకపోవటంతో సోహెల్ ఆవేదన వ్యక్తం చేశాడు. బిగ్‍బాస్ సమయంలో సపోర్ట్ చేసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, తన మూవీ చూడాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రోల్స్ కూడా వచ్చాయి. మిక్స్డ్ టాక్ రావడంతో బూట్‍కట్ బాలరాజు అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లను రాబట్టలేకపోయింది.బూట్‍కట్ బాలరాజు సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 1వ తేదీన స్ట్రీమింగ్‍కు రావడం దాదాపు ఖరారైంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో సోహెల్‍కు జోడీగా మేఘమాల నటించారు. ఈ చిత్రం కూడా విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీతో వచ్చింది. సర్పంచ్ ఎన్నికల చుట్టూ ఈ కథ సాగుతుంది.బూట్‍కట్ బాలరాజు చిత్రానికి శ్రీకోనేటి దర్శకత్వం వహించారు. సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, అవినాశ్, సద్దాం, వివేక్ కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సెసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు.మొత్తంగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా ఆహాలో, బూట్‍కట్ బాలరాజు మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చి 1న అడుగుపెట్టనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: