‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ బేగంపేట శ్మశాన వాటికలో లాంచ్ చేస్తారు అని వచ్చిన వార్త తెలుగు మీడియాకు మాత్రమే కాకుండా జాతీయ మీడియాకు కూడ హాట్ టాపిక్ గా మారడంతో ఈ చిన్న సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం ట్రెండింగ్ గా మారింది. దీనితో ఈ కార్యక్రమాన్ని శ్మశానంలో ఎలా నిర్వహిస్తారు అన్న ఆశక్తి అందరిలోను  పెరిగిపోవడంతో అందరు ఎంతో ఆశక్తిగా ఎదురుచూసిన ఈఫంక్షన్ కు ఈమూవీ నిర్మాత కోన వెంకట్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.


తమను ఆత్మలు భయపెడుతున్నాయని అందువల్ల భయంతో తమ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ బేగంపేట శ్మశానవాటికకు బదులు దసపల్లా హోటల్ కు మార్చినట్లు ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన కూడ వైరల్ గా మారడంతో కోన వెంకట్ ను అదేవిధంగా ‘గీతాంజలి’ టీమ్ ను ఆత్మలు భయపెట్టాయి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు ట్రెండింగ్ గా మారాయి.


వాస్తవానికి ఈ చిన్న సినిమా గురించి చాలామందికి తెలియకపోయినా ఇప్పుడు ఈ శ్మశానం న్యూస్ తో చాలామంది ఈసీక్వెల్ ఎలా ఉండబోతోంది అన్న ఆశక్తితో ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ‘గీతాంజలి’ చిన్న సినిమాగా విడుదలై అప్పట్లో విజయాన్ని అందుకోవడంతో అంజలి శ్రీనివాస రెడ్డి కోన వెంకట్ పేర్లు అప్పట్లో ట్రెండింగ్ గా మారాయి.


ప్రస్తుత కాలంలో సీక్వెల్స్ సీజన్ బాగా నడవడమే కాకుండా సీక్వెల్స్ పట్ల ప్రేక్షకులు బాగా ఆశక్తి కనపరుస్తున్నారు. ఈసంవత్సరంలో విడుదల కాబోతున్న అనేక భారీ సినిమాలు ‘ఇండియన్ 2’ ‘పుష్ప 2’ సినిమాల పై ఏవిధంగా అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి పరిస్థితుల మధ్య విడుదల అవుతున్న ఈ హారర్ సీక్వెల్ కు జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈసమ్మర్ రేస్ లో విడుదల కాబోతున్న ఈమూవీతో తిరిగి అంజలి శ్రీనివాస రెడ్డి కోన వెంకట్ తిరిగి ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: