నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ప్రకటించలేదు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇకపోతే నిన్న అనగా ఫిబ్రవరి 24 వ తేదీన నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఒక చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను అమ్మి వేశారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను ప్రత్యాంగార ... ఏ ఏ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని ఈ సంస్థలు తాజాగా అధికారికంగా ప్రకటించాయి. ఇకపోతే దసరా , హాయ్ నాన్న సినిమాలతో వరుసగా రెండు విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నాని నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని నాని కి అందిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: