ఆదివారం కార్తీక దీపం 2 నుంచి మరో కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల.. వంటలక్కగా ప్రేమీ విశ్వనాద్ కనిపించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్క భార్య భర్తలు.. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం నిరుపమ్ వద్ద వంటమనిషిలా పనిచేస్తుంది దీప. తండ్రి కోసం ఎదురుచూస్తున్న కూతురిగా.. తల్లి పై అంతులేని ప్రేమను చూపిస్తూ.. తల్లిలోనూ తండ్రిని చూసుకుంటూ కనిపిస్తుంది శౌర్య. అయితే ఇప్పుడు విడుదలైన ప్రోమో చూస్తుంటే కార్తీక దీపం ఫస్ట్ పార్టుకు ఇప్పుడొచ్చే సకెండ్ పార్ట్ అసలు కనెక్షన్ లేకుండా.. ఈసారి నేపథ్యం కొత్తగా ఉండనుందని అర్థమవుతుంది. అయితే దీప భర్త ఎవరు ?.. నిరుపమ్ ఇంట్లో వంటమనిషిలా ఎందుకు ఉంది ? అనే కొత్త సందేహాలు మాత్రం ప్రేక్షకులకు రావడం ఖాయం. ఈసారి కార్తీక దీపం నవ వసంతంతో జనాలకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తారో చూడాలి.ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మోనితా, సౌందర్య, హిమ పాత్రల గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కేవలం వంటలక్క, డాక్టర్ బాబు, శౌర్య పాత్రలను మాత్రమే రివీల్ చేశారు. దీంతో ఇందులో మోనితా మళ్లీ కనిపిస్తుందా ? లేదా?.. అనేది చూడాలి. కొత్త వెలుగులతో.. తెలుగు లోగిళ్లు మరువని కథ.. కార్తీక దీపం 2 త్వరలోనే రాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి