ఇటీవల మలయాళీ, తమిళ్ లు సినీ ప్రియులకు ఎక్కువగా నచ్చేస్తున్నాయి. అక్కడి చిత్రాల కంటెంట్ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ‘జో’ ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుందో చెప్పక్కర్లేదు.అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ యూత్‏కు కనెక్ట్ అయ్యింది. దీంతో ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరో పేరు కూడా నెట్టింట మారుమోగుతుంది. అదే ‘ప్రేమలు’. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. లవ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సెన్సేషన్ హిట్ గా దూసుకుపోతుంది. సుమారు రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి దాదాపు రూ.63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో స్ట్రీమింగ్ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ప్రేమలు’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ మూవీ కోసం హాట్ స్టార్ భారీగానే వచ్చించిందని తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. ప్రేమలు చిత్రాన్ని తెలుగులో నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు టాక్. తెలుగు వెర్షన్ అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయాన్ని వెల్లడించలేదు. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ను మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ ను రూపొందించారు.ఇందులో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు జంటగా నటించగా.. ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ ను హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు డైరెక్టర్ గిరీశ్. విష్ణు విజయ్ సంగీతం అందించగా.. దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: