లేటెస్ట్ మలయాళ సన్సేషనల్ మూవీ ప్రేమలు మూవీ తెలుగు లో మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మలయాళ భాషలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రస్తుతం దక్కుతున్నాయి. ఇలా ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రస్తుతం దక్కుతూ ఉండడంతో ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఎస్ ఎస్ కార్తికేయ దక్కించుకున్నారు. 

అందులో భాగంగా ఈయన ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మలయాళం లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను మార్చి 8 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ను మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనుండగా ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను మాత్రం మార్చి 7 వ తేదీనే కొన్ని థియేటర్ లలో ప్రదర్శించబోతున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను మార్చి 7 వ తేదీన ప్రదర్శించనున్నట్లు అలాగే ప్రసాద్ మల్టీ ఫ్లేక్స్ దియేటర్ లో ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షోస్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: