‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తరువాత అనుష్క చిరంజీవితో ‘విశ్వంభర’ లో నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆవార్తలు నిజంకాలేదు. ఎవరు ఊహించని విధంగా అనుష్క ఒక పీరియాడిక్ థ్రిల్లర్ మూవీలో ఒక డిఫరెంట్ పాత్రను చేయబోతోంది. ఈసినిమా ప్రారంభోత్సవం ఈమధ్యనే జరిగింది. ఈ ఈవెంట్ కు వచ్చిన అనుష్క లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.‘సైజ్ జీరో’ బొద్దుగా మారిన అనుష్క ఫిజిక్ లో ఇప్పుడు మార్పులు రావడమే కాకుండా ఆమె అభిమానులు కోరుకునే విధంగా ఆమె కొంతవరకు సన్నగా మారింది. ఆమె న్యూ లుక్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్న అనుష్క ఆమూవీ పూర్తి కాకుండానే ఇప్పుడు మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకునే ఈమూవీని దక్షిణాదికి సంబంధించిన అన్ని భాషలలోను డబ్ చేసి విడుదలచేయబోతున్నారు అని తెలుస్తోంది.తెలుస్తున్న సమాచారంమేరకు మళయాళంతో పాటు దక్షిణాది అన్ని భాషలలోకి డబ్ చేసి విడుదలచేయబోయే ఈమూవీ పేరు ‘కథనర్’ 9వ శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడుకు సంబంధించిన కథ ఇది అని అంటున్నారు. ఆరోజులలో ట్రావెన్కోర్ సంస్థానంలో నీలి అనే దేవదాసీ కూతురు ఉండేదట అయితే కొన్ని అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే నీలి కథలో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి అని అంటారు.నీలి గురించి కేరళ సాహిత్యంలో అనేక చోట్ల ప్రస్తావన ఉంది. ఇప్పటికీ మళయాళం జానపద సాహిత్యంలో నీలి కి సంబంధించిన కథలు చాలామందికి కనిపిస్తూనే ఉంటాయి. దానిని ఆధారంగా తీసుకుని ఒక థ్రిల్లర్ మూవీ కాన్సెప్ట్ తో ఈ ‘నీలి’ మూవీని తీస్తున్నారు. మళయాళ దర్శకుడు రోజిన్ థామస్ అనే వ్యక్తి ఈమూవీ ద్వారా తెలుగు వారికి తన సత్తాను చూపెడుతున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీని వచ్చే సంవత్సరం రెండు భాగాలుగా తీయబోతున్న ఈమూవీ 2025 సంక్రాంతికి విడుదల అని అంటున్నారు. ఊహించని మలుపులు ట్విస్ట్ లు ఎన్నో ఉంటాయట..
మరింత సమాచారం తెలుసుకోండి: