మొదట పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ చాందిని చౌదరి.. అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది. కేటుగాడు సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెర్పిస్తూనే ఉంది చాందిని చౌదరి. సుహాన్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమా తో మంచి యాక్టర్ గా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించింది. రీసెంట్గా గామి సినిమాలో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇదంతా ఇలా ఉంటే ఆ మధ్య ఒకరు చాందిని చౌదరిని బెదిరించారట..


గెస్ట్ హౌస్ కు రావాలని లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేస్తానంటూ బెదిరించారని తెలుస్తోంది.. ఈ విషయం పైన చాందిని చౌదరి మాట్లాడుతూ ఒకరోజు ఒక కొత్త నెంబర్ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని ఆ మెసేజ్ లో గెస్ట్ హౌస్ కి రావాలి లేకపోతే తన ఫోటోలు వీడియోలు మార్పిన్ చేస్తామంటూ బెదిరించారట.అది చూసిన చాందిని చౌదరి ఏం చేయాలో తెలియక చాలా ఏడ్చేశానని  అయితే ఆ బెదిరించింది మరెవరో కాదు స్నిగ్ధ.. ఈమె టాలీవుడ్ లో టాయ్ బాయి గా పేరు తెచ్చుకున్న నటి స్నిగ్ధ..


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధ కు మీరు ఎప్పుడైనా దూల పని చేశారు.. అనే ప్రశ్న అడగగా ఆమె ఇలా మాట్లాడుతూ చాందిని చౌదరిని సరదాగా ఏడిపించాను అంటూ వెల్లడించింది.. అయితే అసలు విషయం చెప్పిన తర్వాత చాందిని నువ్వెక్కడున్నావ్ అంటూ అడిగిందట పలానా ప్లేస్ లో ఉన్నానని చెప్పగానే అక్కడికి వచ్చి లాగిపెట్టి కొట్టిందంటూ స్నిగ్ధ  స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం చాందిని చౌదరి గురించి ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. తోటి నటి నటులే సరదాగా ఇలా చేస్తే ఎలా అంటూ కూడా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా చాందిని చౌదరి సరైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: