తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు .హాస్పిటల్‌కు చేరుకునేలోపే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం మరియు కన్నడలో పలు సినిమాలు చేసి మెప్పించారు. తన కెరీర్ లో ఆయన ఎక్కువగా విలన్ రోల్స్‌లోనే కనిపించారు. చిట్టి అనే తమిళ సీరియల్‌తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. పిన్ని పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ బాగా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్ మరియు కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న  చిన్న పాత్రలలో నటించాడు..

విశ్వనటుడు కమల్‌హాసన్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్‌ లో వచ్చిన వెట్టైయాడు విలయాడు మూవీలో డేనియల్ బాలాజీ సైకో క్యారెక్టర్‌లో కనిపించి తన విలనిజంతో ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టారు .ఈ సినిమా తెలుగులో రాఘవన్ గా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీ నటుడి గా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో పొల్లవదన్‌, జ్ఞానకిరుక్కన్‌, అచ్చం యెన్‌బదు మదమైయదా, వడాచెన్నై మరియు బిగిల్‌తో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ పాత్రల్లో కనిపించి మెప్పించాడు.డేనియల్ బాలాజీ చివరగా గత ఏడాది అరియవాన్ అనే తమిళ సినిమాలో కనిపించాడు.. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డేనియల్ బాలాజీ ఆ తర్వాత వెంకటేష్ ఘర్షణ మూవీ లో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించి మెప్పించాడు.. ఈ రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో అదరగొట్టాడు..చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోలనే తలదన్నే విధంగా అద్భుతమైన విలనిజాన్ని పండించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: