టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించాడు. వాటిలో చాలా శాతం మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఈయన సంపాదించుకున్నాడు. ఇక ఈయన దిల్ రాజు "ఫ్యామిలీ స్టార్" అనే మూవీని నిర్మించాడు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా... మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించాడు.

మూవీ ఏప్రిల్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యింది. కానీ ఈ సినిమా విడుదల అయిన మొదటి షో అనంతరం ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ పడ్డాయి. దానితో ఈ సినిమా కలెక్షన్ లపై ఆ ఇంపాక్ట్ కనిపించింది. ఇక ఈ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది అని రివ్యూవర్స్ కావాలనే ఈ సినిమాని నెగిటివ్ గా జనాల్లోకి తీసుకెళ్తున్నారు అని దిల్ రాజు అవేదన వ్యక్తం చేశాడు. దానితో ఈయన కొన్ని థియేటర్ ల లోకి స్వయంగా మైక్ పట్టుకుని వెళ్లి కొంత మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సినిమా ఎలా ఉంది అని అడిగాడు. దానికి వారు సినిమా సూపర్ గా ఉంది.

కొంత మంది మాత్రమే కావాలని ఈ సినిమాను నెగిటివ్ గా జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. మీరు కచ్చితంగా ఈ సినిమాను పాజిటివ్ వే లో జనాల్లోకి తీసుకు వెళ్లేలా ప్రయత్నించండి అని దిల్ రాజు కు సూచించారు. ఇక దీనితో దిల్ రాజు తాజాగా... సినిమాపై నెగటివ్ ప్రచారం ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదు. ఇటీవల కేరళలోని ఓ కోర్టు రివ్యూల పై ఓ తీర్పు ఇచ్చినట్లు నేను విన్నాను. సినిమా విడుదల అయిన మూడు రోజుల తర్వాత రివ్యూ ఇవ్వాలని ఆ కోర్టు సూచించినట్లు నాకు తెలిసింది. అలాంటి పద్ధతినే మన దగ్గర కూడా అమలు చేస్తే బాగుంటుంది. దాని వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అని నా విన్నపం అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr