టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఆఖరుగా సైన్ధవ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్ గా నటించగా ... డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. చివరగా ఈ సినిమా అపజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను కూడా పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే అలరించగలిగింది. ఇక ధియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పెద్ద స్థాయిలో అలరించలేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ లో టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయ్యింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ చానల్లో ప్రసారం చేసుకోగా మొదటి సారి ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 2.73 "టీ ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది. ఈ మూవీ కి మొదటిసారి వచ్చిన "టి ఆర్ పి" రేటింగ్ ను బట్టి చూస్తే ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను అలరించడంలో కూడా విఫలం అయ్యింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: