అతి తక్కువ సమయంలో వన్ మిలియన్ లైక్స్ ను సాధించిన టాలీవుడ్ టాప్ 4 టీజర్స్ ఏవో తెలుసుకుందాం.

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ విడుదల అయిన 6 గంటల 15 నిమిషాల సమయంలో 1 మిలియన్ లైక్స్ ను సాధించింది. పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమా టీచర్ ను విడుదల చేసింది. ఇక ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 9 గంటల 59 నిమిషాల సమయానికి 1 మిలియన్ లైక్స్ లభించాయి.

ఆర్ ఆర్ ఆర్ : ఈ మూవీ లోని "రామరాజు ఫర్ భీమ్" టీజర్ కి విడుదల అయిన 36 గంటల 04 నిమిషాల సమయానికి 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ... రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

పుష్ప పార్ట్ 1 : అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ కి విడుదల అయిన 59 గంటల 10 నిమిషాలకు 1 మిలియన్ లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: