అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ సోమవారం పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో లో టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఈ టీజర్ ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. అల్లు ఫ్యాన్స్ నెట్టింట ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.ముఖ్యంగా ఈ టీజర్ లో మాతంగి (అమ్మవారి) వేషంలో అల్లు అర్జున్ అద్భుతంగా కనిపించారు. పుష్ప స్వాగ్, స్టైల్ అదిరిపోయింది. జాతర సీక్వెన్స్ కన్నుల పండువగా ఉంది. బన్నీ అమ్మవారి గెటప్, స్టైల్, ఓ యాక్షన్ స్టంట్ ను మేకర్స్ హైలైట్ చేశారు. ఈ జాతర సీక్వెన్స్ లో ఒక పాటతో పాటు మాస్ ఫైట్ ఉండనుందని సమాచారం తెలుస్తుంది. దీంతో బిగ్ స్క్రీన్ పై బన్నీ విశ్వరూపం చూడనున్నామని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. టీజర్ చూసాక పక్కా 1000 కోట్ల బొమ్మ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా 1000 కోట్ల టార్గెట్గా అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ టీజర్ పెర్ఫెక్ట్ గా రావడానికి అల్లు అర్జున్ 51 టేక్స్ తీసుకున్నారట.


ఈ విషయాన్ని పుష్ప-2 సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి తెలిపారు. జాతర సీక్వెన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఒక్క నిమిషానికి పైగా ఉన్న గ్లింప్స్ కోసం చాలా వర్క్ జరిగిందని వెల్లడించారు. అల్లు అర్జున్.. రోల్ అండ్ షూట్ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉంటారని పేర్కొన్నారు. పెర్ఫెక్ట్ గా షాట్స్ రావాలని కొన్ని సీన్లను అడిగి మరి బన్నీ రీషూట్ చేయించారని తెలిపారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బన్నీ డెడికేషన్ అంటే అలా ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏ విషయంలో కూడా అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ సందడి చేస్తున్నారు. ఫుల్ అంచనాలు నెలకొన్న పుష్ప-2ను సుకుమార్ గ్రాండ్ గా తెరకెక్కిస్తుండగా.. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: