అల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో కొంతకాలం క్రితం లడ్డు బాబు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పూర్ణ, భూమిక ముఖ్య పాత్రలలో నటించగా... త్రిపురనేని చిట్టిబాబు సోదరుడు అయినటువంటి త్రిపురనేని రాజేంద్ర ఈ సినిమాను మహారధి ఫిలింస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమా 2014వ సంవత్సరంలో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా త్రిపురనేని చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈ సినిమా ప్లాప్ కావడానికి గల కారణాలను... అలాగే ఈ సినిమా వల్ల ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే వివరాలను తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో చిట్టిబాబు మాట్లాడుతూ ... నా తమ్ముడు లడ్డు బాబు సినిమాను నిర్మించాడు. కాకపోతే అతనికి సినిమా రంగంపై, కథలపై పెద్దగా పట్టులేదు. నేను ఆ సమయంలో రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఈ కథను మొదటి స్టేజిలో పెద్దగా పండించుకోలేదు.

ఇక ఆ తర్వాత ఈ సినిమా కథను నేను విన్నాను. ఆ తర్వాత రవి బాబుకు చెప్పాను ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడ అయినా తమ పిల్లలు గుడ్డివాళ్ళు అయిన, చెవిటి వాళ్ళు అయినా ఇతర ఏ లోపంతో ఉన్న సమాజం వారిని కించపరిచిన తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు కించపరచరు. నువ్వు ఈ సినిమాలో అల్లరి నరేష్ తండ్రి పాత్ర చేస్తున్న కోటా తో ఎప్పుడు అతని తిప్పిస్తున్నావ్... అది అసలు వర్కౌట్ కాదు అన్నాను.

ఆయన దానికి మీరు ఓల్డ్... మీకు ఇప్పటి జనరేషన్ గురించి తెలియదు అన్నాడు. నేను దానితో సైలెంట్ అయ్యాను. అలాగే 6 కోట్లలో ఈ సినిమాను పూర్తి చేయాలి అని అన్నాను. వారు ఎనిమిది కోట్లకు మించి ఖర్చు పెట్టారు. అది కూడా వర్కౌట్ కాదు అన్నాను. అలాగే సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్లు వచ్చినప్పుడు కూడా దానిని కూడా వద్దన్నాడు. చివరకు సినిమా వల్ల ఎనిమిది కోట్ల నష్టం వచ్చింది. దీనంతటికీ రవి బాబు కారణం అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా చిట్టి బాబు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: