టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ నిన్న అనగా ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నప్పటికీ కొన్ని రికార్డులను మాత్రం కొట్టలేకపోయింది.

మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ సినిమా యొక్క టీజర్ అనేక మూవీల టీజర్ ల రికార్డులను బద్దలు కొడుతుంది అని అల్లు అర్జున్ అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులు కూడా భావించారు.

"పుష్ప పార్ట్ 2" మూవీ టీజర్ ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకొని అద్భుతమైన వ్యూస్ ను సాధించుకున్నప్పటికీ కొన్ని రికార్డుల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ టీజర్ విడుదల అయిన కేవలం 6 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే 2 మిలియన్ లైక్స్ ను సాధించింది.

ఈ రికార్డును "పుష్ప పార్ట్ 2" టీజర్ అవలీలగా దాటేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ "పుష్ప పార్ట్ 2" టీజర్ దీని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. "పుష్ప పార్ట్ 2" టీజర్ విడుదల అయిన 9 గంటల 59 నిమిషాలకు 1 మిలియన్ లైక్స్ ను సాధించింది. ఇది ఇలా ఉంటే పుష్ప మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: