సౌత్ ఇండస్ట్రీలో లేడీ క్వీన్ గా గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ ఎవరు అంటే అనుష్క పేరును చెబుతూ ఉంటారు ప్రేక్షకులు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది.  సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ.. ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాలతో పాటు.. ఇక యంగ్ హీరోలు సరసన నటిస్తోంది.



 అయితే ఒకప్పటిలా వరుసగా సినిమాలు చేయకపోయినప్పటికీ.. మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత ఏడాది నవీన్ పోలిశెట్టి లాంటి యువ హీరో తో కలిసి నటించింది. మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఈ మూవీ తర్వాత మరో మూవీపై ఎలాంటి ప్రకటన చేయని అనుష్క ఇక ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు రెడీ అవుతుంది అన్నది తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడట.



 ఈ మూవీకి ఘాటి అనే టైటిల్ని ఫిక్స్ చేశారు అంటూ ఇప్పటికే ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా అనుష్క, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఈ మూవీలో  కీలక సన్నివేశాల కోసం అనుష్క 60 ఏళ్ల వృద్ధురాలు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే అనుష్కకు ఇలా విభిన్నమైన పాత్రల్లో నటించడం కొత్తేమి కాదు. గతంలో ఏకంగా సైజ్ జీరో మూవీ కోసం భారీగా బరువు పెరిగిపోయింది. ఇక బాహుబలి సినిమాలోను ఏకంగా ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రయోగమే చేయబోతుంది అనుష్క. అయితే గతంలో సైజ్ జీరో సినిమా చేసి కెరీయర్ ను పాడు చేసుకున్న అనుష్క ఇప్పుడు 60 ఏళ్ల వృద్ధురాలిగా చేసి కెరీర్ను ప్రమాదంలో పడేసుకుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: