విడుదలైన 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ 5 ఇండియన్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరుగా సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ దక్కాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఆది పురుష్ మూవీ టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో 68.96 మిలియన్ వ్యూస్ దక్కాయి.

యాష్ హీరో గా రూపొందిన "కే జీ ఎఫ్ చాప్టర్ 2" మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 68.83 వ్యూస్ దక్కాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన రాదే శ్యామ్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 42.66 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ టీజర్ ను తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ మూవీ యూనిట్ వారు విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 39.36 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇకపోతే ఇప్పటి వరకు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 ఇండియన్ మూవీస్ లో ఐదు కూడా సౌత్ ఇండియన్ ఇండియన్ మూవీస్ ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: