పుష్ప సినిమాలోని పుష్ప పుష్పరాజ్ అనే డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్లీ మళ్లీ చెప్పాలి అనే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నా కూడా గూసుబాంబ్స్ గ్యారెంటీ. ఇక ఈ సినిమా విడుదల సంవత్సరాలు అయినప్పటికీ ఈ సినిమాలోని ఆ డైలాగ్ పవర్ మాత్రం ఇంకా తగ్గడం లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా పుష్ప. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కు నేషనల్ అవార్డు సైతం వచ్చింది.

 అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా పుష్పటు సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సైతం విడుదల చేశారు మేకర్స్. బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్పట్టు సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఒక్క టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే.. ఈ టీజర్ లో అల్లు అర్జున్ చీర కట్టులో కనిపిస్తాడు . అంతేకాదు చీర కట్టులో ఫైట్ చేయడం సినిమాకి హైలైట్ గా మారబోతుంది . అయితే ఈ షాట్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడట .

ఆయన కెరియర్ లోనే ఇన్ని టేకులు తీసుకున్న ఫస్ట్ సీన్ ఇదే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ 2024 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం కొట్లాదిమంది బన్నీ ఫ్యాన్స్ అలాగే స్టార్ సెలబ్రిటీస్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో నేషనల్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఆమెతోపాటు పలువురు కీలకపాత్రలో నటించారు.. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది పుష్ప వన్ లో సైతం అనసూయ కీలక పాత్రలో నటించిన కాగా ఇప్పుడు కూడా అదే పాత్రలో కంటిన్యూ అవుతుంది!!

మరింత సమాచారం తెలుసుకోండి: