సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సరే మా లను చేసి స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలో చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి ఒక్కసారిగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు  వివిధ దేశాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తదుపరి సినిమాపై భారీగా అంచనాలను పెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.

 అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఇక మొదటి భాగం ఈ సంవత్సరం విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ కి కూడా ఎంట్రీ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 లో నటిస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కనిపిస్తాడా

 లేదా ఏదైనా కీలక పాత్రలో కనిపిస్తాడా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. గత కొద్దిరోజులుగా ఈ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి తండ్రిగా జగపతి బాబు కనిపించబోతున్నారని వార్తలు తెగ చెక్కర్లు చెయ్యగా ఈ విషయంపై ఫైనల్ గా స్పందించారు జగపతిబాబు. ఈమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబుకి ఇదే ప్రశ్న ఎదురవగా.. "ఈ రూమర్ ని నేను కూడా విన్నాను. కానీ నాకు వార్ 2 సినిమా బృందం నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. ప్రస్తుతం అయితే ఇది రూమర్ మాత్రమే, నిజం కాదు" అంటూ తెలియజేశారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. మరి ఈ చిత్రం ఎన్టీఆర్ ని ఏ లెవెల్ కి తీసుకోబోతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: