ప్రతి వారం లాగానే ఈ వారం కూడా అనేక సినిమాలు తెలుగు భాషలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అందులో భాగంగా ఈ వారం తెలుగు భాషలో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ మూవీ లు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

గామి : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు విద్యాదర్ దర్శకత్వం వహించగా ... చాందిని చౌదరిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలను పొందిన ఈ సినిమా తాజాగా తెలుగు , తమిళ , కన్నడ భాషలలో "జీ 5" ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఓం బీమ్ బుష్ : శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తాజాగా తెలుగు భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రేమలు : మొదట పెద్దగా అంచనాలు లేకుండా మలయాళంలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ఆ తర్వాత ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో విడుదల చేశాడు. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ యొక్క తెలుగు డిజిటల్ హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను ఈ రోజు నుండి తమ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott