టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన కమీడియన్ లలో ఒకరు అయినటు వంటి వెన్నెల కిశోర్‌ తాజాగా "చారి 111" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిం దే.  సంయుక్తా విశ్వనాథన్‌ , మురళీ శర్మ , సత్య తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు . అదితి సోనీ నిర్మించిన ఈ మూవీ కి ... టీ జీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించాడు. సైమన్ కె కింగ్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 1, 2024 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. 

పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇలా ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకులను అలరించడం లో సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు ఈ సినిమా ఇప్పటి వరకు 60 మిలియన్ ప్లస్ మినట్స్ ను సాధించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా "చారి 111" మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో దుమ్ము లేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vk