తమిళ నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈయన వరుస సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నప్పటికీ రాజకీయాలపై కూడా ఈయన ఎక్కువ గానే దృష్టి పెడుతూ ఉంటాడు . అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈయన మరికొన్ని రోజుల్లోనే ఓ పార్టీని స్థాపించబోతున్నట్లు తమిళ నాడు లో 2026 వ సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తాను కూడా పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు . దీని ద్వారానే అర్థం అవుతుంది విశాల్ కి రాజకీయాలు అంటే ఎంత ఇష్టం అనేది.

ఇకపోతే కేవలం తన రాష్ట్ర రాజకీయాల గురించి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్ర రాజకీయాల గురించి కూడా విశాల్ బాగానే తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది . తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎవరు సీఎం కాబోతున్నారు అనే విషయం గురించి చెప్పుకొచ్చారు . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో విశాల్ మాట్లాడుతూ ... మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఇందులో వైసీపీ పార్టీ గెలుస్తుంది అని ... జగన్ సీఎం అవుతాడు అని విశాల్ చెప్పుకొచ్చాడు. వైసీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నానని నేను ఎప్పుడూ చెప్పలేదు.

కాకపోతే జగన్ చేసే మంచి పనులను నేను ఫాలో అవుతూ ఉంటాను . అందుకే ఆయనే మరో సారి సీఎం అవుతారు అని నేను అనుకుంటున్నాను. అలాగని నాకు ఎవరిపై కోపం లేదు . అలాగే జగన్ పై తాజాగా జరిగిన రాళ్ల దాడిపై విశాల్ స్పందిస్తూ ... జగన్ పై ఎటాక్ లు కొత్తేమీ కాదు . ఎయిర్ పోర్ట్ లోనూ అతన్ని కత్తితో పొడిచారు. రాయలసీమ నుంచి వచ్చిన ఆయనకు ధైర్యం ఎక్కువ అని విశాల్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: