నారా కుటుంబ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ఒకప్పుడు వరసపెట్టి సినిమాలు చేశాడు. అయితే గత కొంతకాలంగా అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈపరిస్థితుల మధ్య విభిన్నమైన కథలను ఎంచుకుంటాడు అని పేరున్న ఈ నారా హీరో ‘ప్రతినిధి 2’ వచ్చేవారం రాబోతున్నాడు.ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల పై ఈ మూవీలో సెటైర్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణ వేడి వేసవి ఎండలను మించి ఉండటంతో ఈచిన్న సినిమా ఎవరు ఊహించని హిట్ ను రోహిత్ కు అందిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈమూవీకి టీవి 5 మూర్తి దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈమూవీ పై కొన్ని వర్గాలలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.ఈమూవీలో పొలిటికల్ సెటైర్స్ తో పాటు ఒక సెంటిమెంట్ ను కూడ నమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1992లో వెంకటేష్ నటించవ మూవీ ‘సుందరాకాండ’ టైటిల్ ను నారా రోహిత్ మూవీకి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ ‘సుందరాకాండ’ మూవీ ఆరోజులలో సూపర్ హిట్. ఆతరువాత నారా రోహిత్ అనేక సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో రోహిత్ మార్కెట్ బాగా తగ్గిపోయింది.ఈపరిస్థితుల మధ్య ‘సుమందరాకాండ’ బాగా హిట్ అవుతుందని రోహిత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు గతంలో అతడు నటించిన ‘ప్రతినిధి’ మూవీ హిట్ ఈమూవీ విజయంతో తిరిగి నారా రోహిత్ కెరియర్ మళ్ళీ గాడిన పడుతుంది అనుకోవాలి. లేటెస్ట్ గా రాబోతున్న ‘సుందరాకాండ’ మూవీలో చాల పొలిటికల్ పంచ్ లు ఉండబోతున్న నేపధ్యంలో ఎంతవరకు ఈనిమాను జనం ఆదరిస్తారు అన్న విషయం ఈ వీకెండ్ ఈ వీకెండ్ కు తెలిపోతుంది. గతంలో ఇదే టీవి 5 మార్థి అమరావతి రైతుల ఉద్యమం నేపధ్యంలో ఒక సినిమాను తీసినప్పటికీ ఆసినిమా సక్సస్ కాలేదు. ఇప్పుడు ఈ ‘తినిధి 2’ ఎంతమేరకు నారా రోహిత్ కు కలిసి వస్తుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: