టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కృష్ణ చైతన్యమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని మే 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన తేదీని , సమయాన్ని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏప్రిల్ 25 వ తేదీన సాయంత్రం 4 గంటల 01 నిమిషానికి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సూపర్ గా ఉండడంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో విశ్వక్ నటిస్తున్న సినిమాలు వరుసగా విజాయలను సాధిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో విశ్వక్ ఏ సాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs