కోవై సరళ.. ఈమె గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్టార్ లేడీ కమెడియన్ గా  హవా నడిపించిన ఈమె.. తన హావభావాలతో డైలాగ్ డెలివరీతో కోట్లాదిమంది ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయింది. సాధారణంగా హీరో హీరోయిన్ పాత్రల కంటే అటు కమెడియన్ రోల్స్ చేయడమే చాలా కష్టం అని అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ కాకపోతే కమెడియన్స్ పై విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కానీ అలాంటి పాత్రలను ఎంతో అలవోకగా చేసేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది  కోవై సరళ.


 ముఖ్యంగా బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్ అయితే ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి అని చెప్పాలి. ఇలా ప్రతి తెలుగు ఇంటికి దగ్గరైనా కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకుంది కోవై సరళ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తంగా 900 సినిమాల్లో నటించి ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది. అలాంటి కోవై సరళ 62 ఏళ్ల వయస్సు వచ్చిన ఇప్పటివరకు పెళ్లి అనే పదానికి దూరంగా ఉంది. ఒంటరిగానే జీవితాన్ని గడుపుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఆమె పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కానీ కోవై సరళ మాత్రం పెళ్లి జోలికి వెళ్లలేదు.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోవై సరళ.. తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే షోలో పాల్గొంది కోవై సరళ. మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ అడగగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది. పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏం లేదు కదా. స్వేచ్ఛగా ఉండాలని చేసుకోలేదు. మరి ఎక్కువగా బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్, షిరిడి లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. ఒంటరిగా భూమ్మీదికి వచ్చాం. ఆ తర్వాతే బంధాలు ఏర్పడ్డాయి. ఒకరి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం లేక పెళ్లి చేసుకోలేదు అంటూ కోవై సరళ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: