జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న కమీడియన్ ముక్కు అవినాష్ గురించి మనందరికీ తెలిసిందే. అలాగే బిగ్ బాస్ ఫోర్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. నాలుగు రాళ్లు కూడా వెనక వేసుకుంటున్నాడు. జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత శ్రీముఖి చమ్మక్ చంద్ర వంటి వారు సహాయం చేయడంతో బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఆ తర్వాత ఈయనకి 2021లో పెళ్లి జరిగింది అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత బాగానే జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు అయ్యేవారు. కానీ ఊహించని విధంగా వీరిద్దరి

 జీవితంలో ఒక విషాదం చోటుచేసుకుంది. అది ఏంటంటే అవినాష్ భార్య గర్భవతి కావడం ..తన బేబీ బంపర్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తల్లిదండ్రులు అయ్యే క్షణం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ ఊహించిన విధంగా వీరి జీవితంలో ఒక పిడుగు లాంటి సంఘటన జరిగింది. అయితే  గర్భంలోనే శిశువు మరణించింది. అది కూడా డెలివరీకి ఒక్కరోజు ముందు.  ఈ సంఘటన గురించి తాజాగా ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. నేను షూటింగ్ లో ఉండగా ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి వెళితే బిడ్డ ఉమ్మ నీరు తాగి మారణించిందని డాక్టర్ తెలిపారు.

 డాక్టర్ కాళ్లపై పడి ఎలాగైనా బిడ్డని బతికించండి అని వేడుకున్నా. హార్ట్ బీట్ లేకుంటే ఎవరైనా ఏం చేయగలం అని డాక్టర్ అన్నారు. ఆ బాధలో రోడ్లపై పిచ్చోడిలా తిరిగా.  నా భార్య అయితే బిడ్డ గురించి చాలా ఊహించుకుంది. ఆమె ఇప్పటికి రాత్రిళ్ళు ఏడుస్తూనే ఉంది అని అవినాష్ తెలిపాడు.  చనిపోయిన బిడ్డని బయటకి తీసినప్పుడు చూశా. బాబు నా పోలికలతోనే ఉన్నాడు అని అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. అభిమానులు,స్నేహితుల మద్దతుతోనే కోలుకోగలిగా అని తెలిపాడు. అలా ప్రస్తుతంకు అవినాష్ తన బిడ్డ ను కోల్పోవడం గురించి స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది ఇక పోరిట్లోనే బిడ్డను కోల్పోయిన తన భార్య ఇప్పటికీ చాలా డిప్రెషన్ లో ఉన్నట్లుగా ఆయన తెలిపాడు. దీంతో ప్రస్తుతం ముక్కు అవినాష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: