‘కూలీ’లో తన పాత్ర గురించి చెప్పమనగా సత్యరాజ్.. అప్పుడే ఆ వివరాలను చెప్పడానికి ఇష్టపడలేదు. అంతా తెరపైనే చూడాలని ఇన్డైరెక్ట్గా సూచించారు. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్లో రజినీకాంత్ సినిమా అనగానే ‘కూలీ’పై భారీ అంచనాలను పెంచేసుకున్నారు ప్రేక్షకులు. ఇక ఇందులో సత్యరాజ్ లాంటి సీనియర్ నటులు ఉండడంతో లోకేశ్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని భావిస్తున్నారు. ఇక ‘కూలీ’కు సంగీతం అందించడం కోసం అనిరుధ్ రవిచందర్ను రంగంలోకి దించారు మేకర్స్. ఈ మూవీ ఇంకా సెట్స్పైకి వెళ్లకముందే దీనికి లీగల్ సమస్యలు కూడా ఎదురయ్యాయి.ఇప్పటికే ‘కూలీ’ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యింది. ఇందులో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటను ఉపయోగించారు మేకర్స్. అయితే తన అనుమతి లేకుండానే ఈ గ్లింప్స్కు తన పాటను జోడించారని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు మ్యూజిక్ మేస్ట్రో. అంతే కాకుండా ‘కూలీ’ టీమ్కు లీగల్గా నోటీసులు కూడా పంపారు. ఇదిలా ఉండగా.. ఈ సమస్యలను పట్టించుకోకుండా ‘కూలీ’ షూటింగ్ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జూన్ 10 నుండి ‘కూలీ’ సెట్స్పైకి వెళ్లనుందని రజినీకాంత్ స్వయంగా ప్రకటించారు. అందుకే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేముందు హిమాలయ పర్యటనను కూడా పూర్తి చేసుకున్నారు రజినీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి