టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన పలు సినిమాలలో నటించిన కూడా అందులో గుణ 369 , బెదురులంక 2012 సినిమాలను మినహాయిస్తే ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. 

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని యువి కాన్సెప్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమాను మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా తాజాగా ఈ మోబి బృందం వారు డిఫరెంట్ ప్రచారాలను స్టార్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు సన్రైజర్స్ జట్టు ఐపిఎల్ 2024 లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ను ఉప్పల్లో ఆడనుంది.

ఈ మ్యాచ్ కి సంబంధించిన కొన్ని టికెట్ లను ఈ మూవీ బృందం ఇవ్వనున్నట్లు , కాకపోతే ఆ టికెట్ లను గెలుపొందాలంటే మూవీ యూనిట్ పెట్టే ఎక్సైటింగ్ కాంటెస్ట్ లో పాల్గొని గెలవాల్సి ఉంటుంది అని ఆ కాంటెస్ట్ ఏంటి అనేది మరికొంత కాలంలోనే తెలియజేస్తాము అని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి బెదురులంక 2012 మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తికేయ భజే వాయు వేగం సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: