తెలుగు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన విడుదల తేదీలను ఇది వరకు కొన్ని సార్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కానీ ఆ తేదీలలో ఈ సినిమాను విడుదల చేయలేదు. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పటికీ ఈ మూవీ బృందం వారు మాత్రం ప్రమోషన్ లో పెద్ద జోష్ ను కనబరచకుండా చాలా సైలెంట్ గా ఉండిపోయారు. దానితో ఈ నెల 31 వ తేదీన చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఇతర మూవీ లకు సంబంధించిన సభ్యులు ప్రచారాలను ఫుల్ జోష్ లో చేస్తూ ఉండడంతో ఈ మూవీ ని మరోసారి పోస్ట్ పోన్ చేస్తారా అని అనుమానాలు కూడా జనాలలో వచ్చాయి. అలాంటి సమయంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా ఎక్కడ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రకటించారు.

దీనితో ఈ సినిమా మే 31 వ తేదీన రిలీజ్ కావడం కన్ఫామ్ అనే జనాలు ఫిక్స్ అయ్యారు. ఇకపోతే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు , అందుకు సంబంధించిన ఈవెంట్ ను దేవి 70 ఎం ఎం థియేటర్ , ఆర్టీసీ క్రాస్ రోడ్ , హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల 06 నిమిషాలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్న అంజలి ఉన్నారు. ఈ మూవీ తో విశ్వక్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs