తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ తాజాగా భజే భాయు వేగం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఒక్కో దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. 

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని , సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మే 25 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఈ సినిమాలో హీరో గా నటిస్తున్న కార్తికేయ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని కార్ డోర్ ఓపెన్ చేసి అందులో కూర్చుని ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య మీనన్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని నిలబడి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే బెదురులంక 2012 మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇకపోతే ఐశ్వర్య మీనన్ కొంత కాలం క్రితం నిఖిల్ హీరోగా రూపొందిన "స్పై" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీబ్యూటీ కి పెద్దగా గుర్తింపుని తెచ్చి పెట్టలేదు. భజే వాయు వేగం సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: