ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీలలో టిడిపి, వైసిపి పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానం జనసేన పార్టీకి ఉందని చెప్పవచ్చు.. కానీ పోత్తులో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు మూడు ఒకటయ్యాయి. అయితే ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ కచ్చితంగా తమకు ఎక్కువగా పోటీ వస్తుందని విషయం ఏపీ సీఎం గ్రహించి ఉండవచ్చు... చంద్రబాబు మీద అసలు లేదట. లోకేష్ మీద కూడా లేదు. టిడిపి పార్టీ బలమైనది కాబట్టి వాస్తవానికి లోకేశే ఇక్కడ అధికార పార్టీని భయపడేలా చేయాలి.. ఎంతో బలమైన కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేసిన జగన్.. అలాంటిది టిడిపి పార్టీకి భయపడరు.


అయితే బలమైన పార్టీ కాదు.. తనలాగే వేవ్, టెమ్ట్ టేషన్ చేసే వ్యక్తికే ఎక్కువ ఆదరణ ఉంటుంది.. పవన్ కూడా జగన్ లాగానే క్రియేట్ చేయగలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు. అందుకే ఎక్కువగా పవన్ మీదేగా ఫోకస్ పెడుతూ ఉంటారు. అందుకే పవన్ కూడా జగన్ను తొక్కేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్మకం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మీద పెద్ద కష్టం కాదు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ వ్యూహం. పవన్ కళ్యాణ్ అభిమానులు మొన్న ఆ మధ్య పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కొన స్టిక్కర్స్ వైరల్ గా చేస్తున్నారు.


ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ కొన్ని పోస్టర్లు వైరల్ గా మారుతున్నాయి. ఇది సాధ్యం కావాలి అంటే మొదట ఏం జరగాలంటే.. తెలుగుదేశం పార్టీకి తక్కువ సీట్లు వచ్చి.. జనసేన సీట్లు డిమాండ్ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు అంటూ వాదన వినిపిస్తోంది.కానీ ఇది సాధ్యమైన పని కాదనే విధంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పది రోజుల్లో ఎమ్మెల్యే కాబోతున్నారు.. వంద రోజుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోబోతున్నారనే విధంగా రచ్చ చేస్తున్నారు.125 రోజుల్లో ఓజి సినిమా విడుదల అవుతుంది అనే విధంగా రచ్చ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సంబరాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: