ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క తప్పుడు నిర్ణయంతో తన కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నాడని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కావడంతో మద్దతు తెలిపేందుకు భార్యతో సహా నంద్యాల వెళ్లాడు. అక్కడకు వెళ్లడానికి ముందురోజు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న తన చిన మామయ్య పవన్ కల్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపాడు. మీ లక్ష్యాన్ని చేరుకోవాలని, తన మద్దతు ఉంటుందని పోస్ట్ లో పేర్కొన్నాడు.ఆ తర్వాత బన్నీ నంద్యాల ఇష్యూ పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే. మాతో ఉండి పరాయివారికి పనిచేసేవాడు తమవాడైనా పరాయివాడే అవుతాడని, తమతో ఉన్నవాడు పరాయివాడైనప్పటికీ తమవాడే అవుతాడంటూ నాగబాబు చేసిన పోస్ట్  పరోక్షంగా బన్నీని ఉద్దేశించే అని అందరికీ అర్థమైంది. ఎన్నికల సమయం కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించారని చెప్పొచ్చు. ముందు వారికి పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలుపొందడం కావాలి. బన్నీ గురించి తర్వాత ఆలోచిస్తారు.ఈ వివాదం వల్ల అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ఫ్లాపయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు బాయ్ కాట్ చేస్తే ఈ సినిమా ఆడటం చాలా కష్టమని, ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని అల్లు అర్జున్ తోపాటు దర్శకుడు సుకుమార్ కూడా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని వీరు సూచిస్తున్నారు. లేదంటే చివరకు బన్నీ కెరీరే ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. అల్లు అర్జున్ కు అభిమానులున్నా, పవన్ కల్యాణ్ కు అభిమానులున్నా, రామ్ చరణ్ కు అభిమానులున్నా, చిరంజీవికి అభిమానులున్నా.. వీరంతా ఒకటేనని, మెగా అభిమానులు కాకుండా అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా అభిమానులేమీ ఉండరని, వారంతా పుష్ప2పై ప్రచారం వ్యతిరేకంగా చేస్తే చివరకు నష్టపోయేది బన్నీ, సుకుమార్, నిర్మాతలేనని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: