ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. అవకాశాలు రావాలంటే హీరోయిన్లు పక్కలోకి వెళ్లాల్సిందేనా.. అవకాశాలు ఇచ్చే ముందే నిర్మాతలు కమిట్మెంట్ అడుగుతారా.. ఇక నిర్మాతలు చెప్పిన పని చేస్తేనే ఆడపిల్లలు ఇక సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటారా.. ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన చర్చ తెరమీదకి వచ్చినప్పుడల్లా.. ఇక అందరూ దృష్టి ఆ వార్త పైన పడిపోతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరు పెద్దగా నోరు విప్పేవారు కాదు.


 కానీ నేటి రోజుల్లో మాత్రం ఎంతో మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ద్వారా తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండటం గమనార్హం. స్టార్ హీరోయిన్ సైతం కెరియర్ తొలినాళ్లలో ఎదురైనా చేదు అనుభవాల గురించి నిజాలు బయటపెడుతూ ఉండడంతో ఇక ఎన్నోసార్లు ఈ ఆయా హీరోయిన్లు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోతూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయి అంటూ ఒక నటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. కెరియర్ తొలినాళ్లలో ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా కలవమని చెప్పినట్లు.. హీరోయిన్ ఈషా కొప్పికర్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.


 కానీ తనను ఆయన విజ్ఞప్తిని తిరస్కరించాను అంటూ తెలిపింది. 18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను. నన్ను చాలామంది అసభ్యంగా తాకేవారు. పని కావాలంటే హీరోలతో సన్నిహితంగా ఉండాలని ఎంతోమంది సలహాలు కూడా ఇచ్చేవారు. కొన్ని కొన్ని సార్లు ఇలా కమిట్మెంట్ అడగడంతో సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది ఈషా కొప్పికర్. కాగా ఆమె చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవా లాంటి సినిమాల్లో నటించింది ఈషా. కాగా ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇకపోతే గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఒక పెద్ద యుద్ధమే జరిగింది అన్న విషయం తెలిసిందే. మీ టు పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న నటిమణులు అందరూ కూడా ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ ఫై సంచలన ఆరోపణలు చేస్తూ నిరసనలు కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: