బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ భర్తకు విడాకులు ఇవ్వబోతుందని గత సంవత్సర కాలం నుండి మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. అయితే వీరి విడాకుల వార్తలు నిజమే అన్నట్టు కొన్నిసార్లు అందరికీ అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తారు. మరికొన్నిసార్లు కలిసిపోతారు.ఇక వీరి ప్రవర్తన ఎవరికి అర్థం కాకుండా తయారైంది. రీసెంట్గా అంబానీ కొడుకు పెళ్లి లో కూడా ఇద్దరు కలిసి రాలేదు. వేరువేరుగా రావడంతో బీటౌన్ లో వీరి విడాకుల వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అయితే తాజాగా వీరిద్దరి విడాకులకు కారణం ఐశ్వర్యరాయ్ ఓ డాక్టర్ తో సన్నిహితంగా ఉండటమేనని, ఆ డాక్టర్ వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అంటూ బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? ఐశ్వర్య రాయ్ కి ఆ డాక్టర్ తో ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. 

చాలామందికి ఫ్రెండ్స్ అనేవారు ఉంటారు. కొంతమంది సెలబ్రిటీల లైఫ్ లో ఫ్రెండ్స్ ద్వారా కూడా విడాకులు తీసుకున్న వాళ్లు, బ్రేకప్ చెప్పుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు.అయితే ఇప్పుడు ఐశ్వర్య జీవితంలో కూడా అలాగే జరగబోతుంది కావచ్చు అని బీటౌన్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కి చాలా క్లోజ్ అయిన ఒక డాక్టర్ ఉన్నారట. ఇక ఆ డాక్టర్ తో చాలా రోజుల నుండి ఐశ్వర్యరాయ్ సన్నిహితంగా ఉంటుందట. పెళ్లయినా కూడా వారి మధ్య స్నేహం తెగిపోలేదట. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్ గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్గా ఆ డాక్టర్ తో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వరరాయ్ ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ డాక్టర్ పేరు జిరాక్ మార్కర్.. ఆ డాక్టర్ తో ఐశ్వర్యారాయ్ కి మంచి సాన్నిహిత్యం ఉందట.అయితే ఈ విషయంలోనే ఐశ్వర్యరాయ్ కి అభిషేక్ కి మధ్య గొడవలు వస్తున్నాయని ,అందుకే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి రావడం లేదని,ఎడమొహం పెడ మొహం పెట్టుకుంటూ దూరం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఆ డాక్టర్ అవుతారని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ జంట విడాకుల విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అలాగే ఐశ్వరరాయ్ తో ఉన్న ఫోటోలను అభిషేక్ బచ్చన్ డిలీట్ చేయలేదు ఐశ్వర్య రాయ్ కూడా భర్తతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఊహాగానాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: