లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పాపులర్ యూట్యూబర్ కాకినాడ పిల్ల ఆల్‌రెడీ కన్ఫామ్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ బీబీ ఎగ్జామ్, ఇంటర్వ్యూ క్లియర్ చేసిందట. ఇక అధికారికంగానూ బిగ్ బాస్ టీమ్ ఆమెను కంటెస్టెంట్ గా ఫైనలైజ్ చేసినట్టు వెల్లడించిందట. సోషల్ మీడియా హాట్ బాంబ్ రీతూ చౌదరి కూడా కన్ఫామ్ అయ్యిందని చెబుతున్నారు. గ్లామర్ షోతో సెగలు పుట్టించే ఈ ముద్దుగుమ్మ ఆల్రెడీ జబర్దస్త్, దావత్ అనే షోలలో కనిపించి చాలామందికి దగ్గర అయింది. ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంటూ ఉంది.
యాంకర్ విష్ణుప్రియా కూడా ఫైనలైజ్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ నాజూకు సుందరి తన అందాల బీభత్సంగా చూపించేస్తుంది. బిగ్ బాస్ షోలో ఈసారి ఆమె గ్లామరస్ కంటెస్టెంట్ కాబోతుందని అంటున్నారు ఆమెను స్కిన్ షో చేయడానికి బిగ్ బాస్ టీం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ యాంకర్ చాలా యాక్టివ్, మంచి కంటెంట్ ఇస్తుంది కాబట్టి బీబీ టీం ఆమెను కోరి మరీ తెచ్చుకుంటున్నట్టుగా సమాచారం. పైగా విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనివల్ల షోకి కాస్త టిఆర్పి రేటింగ్ పెంచినట్లు కూడా అవుతుంది.
మై వీలేజ్ షో అనిల్, యాంకర్ నిఖిల్, అలీ తమ్ముడు ఖయ్యూమ్ కూడా ఇప్పటికే ఫైనలైజ్ అయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బంచీక్ బబ్లూ వచ్చే అవకాశాలు 90% ఉన్నాయని కూడా అంటున్నారు. ఇక మిగతా కంటెస్టెంట్లుగా రేఖా భోజ్, కమెడియన్ యాదమ్మరాజు, నటి సనా, అంజలి పవన్, అమృత ప్రణయ్, సీరియల్ నటి హారిక, సీరియల్ నటులు శ్రీకర్, నిఖిల్, సింగర్ సాకేత్, కమెడియన్ రవి శివ తేజ, నీతోనే డాన్స్ అక్షిత, యూట్యూబర్ సోనియా సింగ్, హీరో ఆదిత్య ఓం, అబ్బాస్, జబర్దస్త్ పవిత్ర, వింద్య విశాఖ, బర్రెలక్క, కుమారి ఆంటీ వాళ్లలో కొందరు రావచ్చు. మరి ఈసారి మనల్ని అలరించడానికి ఎవరు రాబోతున్నారో చూడాలి.