టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో దగ్గుపాటి రానా ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లీడర్ అనే సినిమాతో తెలుగు తరపు పరిచయం అయ్యాడు. పొలిటికల్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా రానా కు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇక రానా ఆ తర్వాత చాలా సినిమాలలో హీరో గా నటించిన ఈయన సోలో హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి మూవీ తప్పితే ఏ సినిమా కూడా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

రానా కేవలం సినిమాలో హీరో పాత్రలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో , ముఖ్య పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే తెలుగు సినిమాలతో పాటు అనేక ఇతర భాష సినిమాలో కూడా రానా నటించి వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం రానా "భీమ్లా నాయక్" సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రానా తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే రానా సినిమాలతో ప్రేక్షకులను పలకరించి చాలా కాలమే అవుతుంది.

తాజాగా రానా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రానా ఎప్పుడు టచ్ చేయని జోనర్ మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు రానా హీరోగా ఒక హార్రర్ జోనర్ మూవీ ని రూపొందించబోతున్నట్లు , ఇప్పటికే అందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: