సాధారణంగా తెలుగు సినిమాలు ఎంటర్‌టైనింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కుతుంటాయి. అయితే ఈ కాలంలో వివిధ కాన్సెప్టులతో భిన్నమైన సినిమాలు కూడా వస్తున్నాయి. దర్శకులు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సినిమాలను కూడా తీసి హిట్స్ అందుకుంటున్నారు. చాలా తెలుగు సినిమాలు వివిధ అంశాలను టచ్ చేస్తున్నాయి కానీ ఇప్పటిదాకా ఏ సినిమా కూడా కుల సమస్యలను పెద్దగా టచ్ చేయలేదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ఒక్క కులం వారు హర్ట్ అయినా సరే ఆ సినిమా బ్యాన్‌ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇద్దరు కొత్త దర్శకులు మాత్రం క్యాస్ట్ టాపిక్‌ను బాగానే టచ్ చేసారు.

ఇటీవల వచ్చిన "కమిటీ కుర్రోళ్ళు", "ఆయ్" వంటి సినిమాలు ఈ సున్నితమైన అంశాలను అర్థవంతంగా చూపించి ఆశ్చర్యపరిచాయి. ఇటీవల వచ్చిన తెలుగు సినిమాలు కులాల గురించి చాలా బాగా చర్చించాయి. తమిళ సినిమాలు కొంచెం బోధనా రీతిలో ఉంటాయి కదా, అలా కాకుండా తెలుగు సినిమాలు ఈ విషయాలను చాలా సూక్ష్మంగా చూపించాయి. ఈ సినిమాల ద్వారా ఈ కొత్త దర్శకులు తెలుగు సినిమా రంగంలోకి వచ్చారు. వీళ్ళు కులాల గురించిన సమస్యలను సినిమా కథలో చాలా బాగా కలిపి చూపించారు.

కొత్త దర్శకులే అయినా ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకొని సినిమాలు తీస్తున్నారు. "ఆయ్" సినిమా క్లైమాక్స్ చాలా బాగుంది అని పాజిటివ్ రివ్యూ పెడుతున్నాను. ఇంకొక సినిమా, "కమిటీ కుర్రోళ్లు"లో దర్శకుడు కులాల గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఏ కులాల ప్రజలను నొప్పించకుండా, చాలా ఆలోచించి ఈ విషయాన్ని సినిమాలో చూపించారు. ఈ రెండు సినిమాల దర్శకులు కులాల గురించి చాలా బాధ్యతగా మాట్లాడారు. "ఆయ్" సినిమాను గీతా ఆర్ట్స్ వాళ్ళు నిర్మించారు. దీని దర్శకుడు అంజి కె. మణిపుత్ర. "కమిటీ కుర్రోళ్లు" సినిమాను నిహారిక కొణిదెల నిర్మించారు. దీనికి దర్శకుడు యాదు వంశి.

మరింత సమాచారం తెలుసుకోండి: