అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో పాత్రలలో నటించిన రాధిక సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. అయితే రాధికాకు మూడు పెళ్లిళ్లు అయ్యాయనే విషయం వైరల్ గా మారడమే కాకుండా..ఆమె తండ్రికి ఏకంగా 5 వివాహాలు అయ్యాయట. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. తెలుగు తమిళం భాషలలో ఎన్నో చిత్రాలలో నటించిన రాధిక హీరోయిన్గా సక్సెస్ అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది.
రాధిక తండ్రి M.R. రాధా ఈయన కూడా తమిళంలో నటుడుగా మంచి పేరు సంపాదించారు. ఏకంగా ఈ నటుడు 5 వివాహాలు చేసుకున్నారు.. ఒకరు ధనలక్ష్మి, మరొకరు జయమ్మ, మరొకరు ప్రేమావతి, మరొకరు సరస్వతి.. కాని చివరిగా శ్రీలంకకు చెందిన గీత అనే మహిళను వివాహం చేసుకున్నారట. ఇలా మొత్తం మీద ఈయనకు 12 మంది సంతానం కలరు. శ్రీలంక మహిళకు జన్మించిన వారి నటి రాధిక శరత్.. ఈమెకు కూడా ఒక చెల్లి ఉంది ఆమె పేరే నిరోషా ఈమె కూడా పరిచిత్రాలలో హీరోయిన్గా నటించింది. ఈమె మొదట నటుడు ప్రతాప్ పోతేన్ ను ప్రేమించి వివాహం చేసుకోక కొన్ని కారణాల చేత విడిపోయి.. మళ్ళీ రీఛార్డ్ హార్డ్ ను వివాహం చేసుకున్నదట. రాధిక భర్త శరత్ కుమార్ కి కూడా రాధిక రెండవ వివాహమేనట.