దీంతో రెగ్యులర్ రొటీన్ కథలను కాకుండా సరికొత్త కాన్సెప్ట్ లతో కూడిన కథను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి ఇక ఇలాంటి సినిమాలు ఇటీవల కాలంలో ప్రేక్షకులందరికీ అంచనాలు పెంచేస్తున్నాయ్. ఇక ఇలాంటి ఒక విభిన్నమైన కథాంశం తోనే సూర్య ఇప్పుడు సినిమా తీస్తున్నాడు అనే విషయం తెలిసిందే. సూర్య హీరోగా కంగువ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నవంబర్ 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 భాషల్లో ఈ సినిమాను రూపొందించారు సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సూర్య కంగువా మూవీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా 10 భాషల్లో రూపొందిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఏకంగా 12 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.