ఈ క్రమంలో ఆయన కడుపులో స్టెంట్ అమర్చారని, స్టెంట్ అమర్చిన తర్వాత రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. శస్త్ర చికిత్స అనంతరం కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉన్న రజనీకాంత్‌ను ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవడంతో జనరల్ వార్డుకు తరలించినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ అనారోగ్యంగా ఉన్నారన్న వార్త బయటకి పొక్కడంతో అభిమానులు వేల సంఖ్యలో అపోలో ఆసుపత్రిని చుట్టిముట్టినట్టు తెలుస్తోంది.
ఇకపోతే, రజనీకాంత్‌కి ఇప్పటికే కిడ్నీ మార్పిడి జరగడంతో.. త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రజనీకాంత్‌ను మరో రెండు మూడు రోజుల పాటు వైద్యులు పరిశీలించే అవకాశం ఉందని, అన్ని పరీక్షలు నిర్వహించి, మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ విషయాన్ని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా.. ఈ సమాచారాన్ని వైద్యులు ఇంకా ధృవీకరించకపోవడం కొసమెరుపు. దాంతోనే రజనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా నటిస్తున్న సంగతి తెలిసినదే. రజనీ కోలుకోవలని అభిమాన లోకం పూజలు చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి