బుల్లితెరపై పాడుతా తీయగా షో ఎంత గొప్పగా పేరు సంపాదించిందో చెప్పాల్సిన పనిలేదు. దివంగత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా ఉండేవారు. కొన్నేళ్లపాటు ఈటీవీలో ప్రారంభమైన ఈ షో ఎంతో మంది టాలెంట్ సింగర్స్ ని సినీ పరిశ్రమకు పరిచయం అయ్యేలా చేసింది. ఆ తర్వాత కూడా ఎన్నో షోలు వచ్చినప్పటికీ ఈ పాడుతా తీయగా షోకి మాత్రం దీటుగా నిలవలేకపోయాయి. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం తర్వాత ఈ షో కి ఎస్పీచరణ హొస్ట్ గా ఉండేవారు. ప్రస్తుతం పాడుతా తీయగా 25వ సీజ టెలికాస్ట్ కాబోతున్నది.


ఈ సీజన్ కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అలాగే ప్రముఖ రచయిత చంద్రబోస్, సింగర్ సునీత జడ్జిలుగా ఉన్నారు. జడ్జిలతో పాటుగా, జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ పైన ప్రముఖ సింగర్ ప్రవస్తి పలు సంచలన వ్యాఖ్యలు తెలియజేసింది. ఈ షోలో ప్రవస్తి ఇటీవలే ఎలిమినేట్ అయ్యింది.. తన యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతూ ..చిన్నప్పటి నుంచి సింగర్ గా ఎన్నో షోలలో పాల్గొన్నారు ఎస్పీ బాలు, జానకమ్మ, సుశీల, చిత్రా వంటి లెజెండ్ సింగర్స్ తో కూడా తను ప్రశంసలు అందుకున్నానని తెలియజేసింది.


తాను మ్యూజిక్ ఫీల్డ్ వదిలేద్దామనుకొని ఫిక్స్ అయ్యాను అందుకే ఈ వీడియో చేస్తున్నానని.. అయితే ఈ వీడియో చేయకుండా ఆపేందుకు ఎంతో మంది ట్రై చేశారు నేను ఫిక్స్ అయ్యాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను జడ్జిలు నన్ను ఒక చీడపురుగులా చూసే వారిని అసలు తాను ఎందుకు పనికిరాను అనేటట్టుగా మాట్లాడే వారిని ఇలాంటి జడ్జిల నుంచి తాను అసలు ఊహించలేదని తన బాడీ మీద ఎక్కువగా జోక్స్ లు వేసేవారని.. ఇక జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ వారు అయితే చీరలు ఇచ్చి బొడ్డు కిందికి కట్టుకోమని ఎక్స్పోజింగ్ చేయమని చెప్పేవారు అంటూ బాంబు పేల్చింది. తనని అటు ఇటు తిప్పే వారు బాడీ షేమింగ్ చేసేవారు.. వారు అనే మాటలకు కాన్ఫిడెన్టే పోతుందని తెలిపింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం సార్ తో పాటు చాలామంది సింగర్స్ ఉండేవారు వారు ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. 2017 సీజనే చాలా బాగుంది అంటూ తెలిపింది కానీ ఎప్పుడైతే జ్ఞాపక ప్రొడక్షన్ వారు వచ్చారు అప్పటినుంచి ఇలాంటి కుళ్ళు జోకులు ఎక్కువయ్యాయని తెలిపింది.



సింగర్ సునీత గారు స్టేజి మీదికి రాగానే అసలు ఎందుకు వచ్చాను అన్నట్లుగా ఫేస్ పెడతారు.. కీరవాణి సార్ తను పాడిన పాటలు పాడితేనే మంచి మార్కులు వేస్తారని.. ఇలా ఒక సంచలన వీడియోని వైరల్ గా బయటపెట్టింది ప్రవస్తి. తాను ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వెడ్డింగ్ షూస్ చేస్తున్నాను.. ఇలాంటివి చేసేవారు అసలు సింగరే కాదో అంటూ ఎద్దేవా చేస్తూ ఉంటారని తెలిపింది ప్రవృస్తి. 


మరింత సమాచారం తెలుసుకోండి: