తెలుగు సినీ పరిశ్రమ లో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వెంకీ అట్లూరి ఒకరు . ఈయన వరుణ్ సందేశ్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్గా రూపొం దిన తొలిప్రేమ అనే సినిమాతో దర్శకుడి గా కెరియర్ను మొద లు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు . ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన మిస్టర్ మజ్ను , రంగ్ దే సినిమాలు వరుసగా బో ల్తా కొట్టాయి. అలాంటి సమయం లో ఈయన సార్ అనే మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు . కొంత కాలం క్రితం ఈ దర్శకుడు లక్కీ భాస్కర్ అనే మూవీ ని రూపొందించి మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న వెంకీ అట్లూరి తన తదుపరి మూవీ ని తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటులలో ఒకరు అయినటువంటి సూర్య తో చేయబోతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి , సూర్యతో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఆల్మోస్ట్ ముగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా టైటిల్ను , ఈ మూవీ లో హీరోయిన్ కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి 796 సిసి అనే టైటిల్ను మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ లో కీర్తి సురేష్ ను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వరస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కావడం , అందులో సూర్య హీరోగా నటించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: