జాన్వి కపూర్ అనగానే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేది ఆమె తల్లి శ్రీదేవి. జాన్వి కపూర్ కటౌట్ కనిపించిన ప్రతిసారి కూడా శ్రీదేవి కటౌట్ గుర్తొస్తుంది అనడం అతిశయోక్తి కాదు. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది శ్రీదేవి. అతిలోకసుందరిగా ఇండస్ట్రీలో ఆమె సంపాదించిన పేరు, ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, డాన్స్, ఎమోషన్ – అన్నింట్లోనూ ఆమెకు ఆమె సాటే. ఆమె నటించిన సినిమాలు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె మాయాజాలం అన్నీ కూడా ఎప్పటికీ మర్చిపోలేనివే.ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, జాన్వి కపూర్ తన తల్లి పేరు చెప్పుకునే ఈ స్థాయిలో అయినా ఇండస్ట్రీలో ముందుకు వెళ్లగలుగుతుందనేది అందరికీ తెలిసిన నిజమే. అయితే ఆ పేరు మాత్రమే కాకుండా, తనదైన గుర్తింపును సంపాదించుకోవడానికి జాన్వి కపూర్ కష్టపడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె గురించి ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతోంది.


శ్రీదేవికి ఎప్పటి నుంచో తన కూతుర్ని హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనే కోరిక ఉండేది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఆమె అనుకోకుండా మరణించడం అందరినీ కలిచివేసింది. అయితే “అమ్మ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తుంది” అనే భావనతో జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి, ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతోంది.ఇక శ్రీదేవి గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, జాన్వి కపూర్ కెరీర్ విషయంలో ఆమె చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉండేదట. ముఖ్యంగా జాన్వి కపూర్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తే ఆమె ఇమేజ్ మరింత బలపడుతుందని, అలా నటించినప్పుడే నిజమైన నటిగా ప్రత్యేక గుర్తింపు వస్తుందని శ్రీదేవి చాలా సందర్భాల్లో తన భర్త బోనీ కపూర్‌కు, కూతురు జాన్వికి సూచనలు ఇచ్చేదట. “ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌లో సక్సెస్ అవ్వాలి, అప్పుడే నిజమైన హీరోయిన్ అనిపించుకుంటుంది” అని ఆమె నమ్మకం.


ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్నేళ్లకు అయినా, ఇప్పుడు ఆ తరహా ప్రాజెక్ట్‌ను జాన్వి కపూర్ ఓకే చేసిందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, జాన్వి కపూర్ ఇటీవలే ఓ పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా పూర్తిగా సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెళ్లైన మహిళలు పడే మానసిక, శారీరక కష్టాలు, పెళ్లి తర్వాత మహిళల జీవితంలో వచ్చే మార్పులు, ఇంట్లోనూ బయటా మహిళల జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) ఎంత ముఖ్యమో అనే అంశాలను చాలా బలంగా చూపించబోతున్నారట. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండబోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


ఇలాంటి బలమైన కథలో జాన్వి కపూర్ నటిస్తే, ఆమె కెరీర్ పూర్తిగా మరో స్థాయికి వెళ్లడం ఖాయం అని అంటున్నారు. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావడమే కాకుండా, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు “శ్రీదేవి కోరికను తీర్చబోతోంది జాన్వి కపూర్” అనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతోంది.మొత్తానికి, తల్లి చూపించిన మార్గంలో నడుచుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే దిశగా జాన్వి కపూర్ అడుగులు వేస్తుండటం ఆమె అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా జాన్వి కపూర్ కెరీర్‌లో ఒక కీలకమైన మలుపుగా నిలుస్తుంది ఏమో చూదాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: