- (  టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’. ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.


అఖండ2 కి ఇంత పెద్ద విజయాన్ని మీరు ఊహించారా.. ?
మనం స్క్రిప్ట్ అనుకున్నప్పుడే కొన్ని హై మూమెంట్స్ అనుకుంటాం. బోయపాటి గారు ఆషామాషి డైరెక్టర్ కాదు. కమర్షియల్ సినిమా నమ్మించేలా తీయడం నిలబెట్టడం చాలా గొప్ప విషయం. అందులోనూ సనాతన ధర్మం కంటెంట్ గా తీసుకుని దాన్ని కమర్షియల్ గా చెప్పడం, అందులోనూ బాలయ్య గారి లాంటి సూపర్ మాస్ ఎనర్జిటిక్ స్టార్ తో చేయడం మామూలు విషయం కాదు. అఖండ పాత్ర అందరికీ సర్ప్రైజ్. నిజానికి అఖండలో అంత ఉంటుందని ఎవరూ అనుకోలేదు. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి మరింత భారీ అంచనాలతో ప్రేక్షకులు వచ్చారు. సనాతన ధర్మాన్ని అద్భుతంగా చెప్పి కమర్షియల్ విజయాన్ని సాధించడం.. బాలయ్య గారికి, బోయపాటి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది.


మ్యూజికల్ గా మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏమిటి.. ?
బోయపాటి గారికి నాకు రెండు నెలలు సమయం కావాలని అడిగాను ఒక్క రీల్ చేసి చూపించాను. ఆయనకు చాలా నచ్చింది. అప్పుడు నాకున్న బడ్జెట్ ని మార్చి, నాకు మరింత సమయాన్ని ఇచ్చి ఎంతగానో సపోర్ట్ చేసి మ్యూజిక్ చేయించారు. అఖండకి అయిన నాకు వెన్నుముకలాగా నిలిచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతో వర్క్ చేశాను. అఖండ మ్యూజిక్ అందరూ సర్ప్రైజింగ్ గా విన్నారు. ఇప్పుడు అఖండ2 లో ఇంకా ఎంత కొత్తగా చేయొచ్చు అని ఆలోచించా. అందులోనూ తాండవం అని పేరు పెట్టారు. ఆడియన్స్ ని ఎలా ట్రాన్స్ లోకి తీసుకువెళ్లాలి అని ఆలోచన చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి 73 రోజులు పట్టింది. అందులో ఒక 20 రోజులు శివుని మంత్రాలు ఎంత కొత్తగా చేయాలి అనే దానికి ఒక 20 రోజులు ఎక్సర్సైజ్ చేశాం. తర్వాత 40 రోజులు ఇన్స్ట్రుమెంట్, రికార్డింగ్ వర్క్ చేసాం.


- జాజికాయ సాంగ్ మిన‌హా సినిమాలోని ఎనిమిది పాటలు కూడా ఆ 70 రోజుల్లో చేసినవే. అఖండ మ్యూజిక్ బ్రెయిన్ కి చాలా మంచి ఎక్సర్సైజ్. శివుడికి సినిమా చేస్తున్నప్పుడు మన మెదడు చాలా శుద్ధి అవుతుంది. జనరల్ గా బోయపాటి గారి సినిమాలో ఇంటర్వెల్ క్లైమాక్స్ చేయడం చాలా కష్టం. మొదటి రీల్ నుంచి నాకు చాలెంజ్ మొదలైంది. అష్టసిద్ధి కుంభమేళా ఇంటర్వెల్, ఆది గారి ఎపిసోడ్, హనుమంతుడు ఎపిసోడ్ లాస్ట్ లో అవెంజర్స్ లాంటి క్లైమాక్స్ ఇవన్నీ చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్నవి. బోయపాటి గారి సినిమాలన్నీ ఒక రీల్ కు మించి మరొకటి ఉంటుంది. ఆయన ఎనర్జీని పట్టుకోవడం చాలా కష్టం. మా టీం చాలా సపోర్ట్ చేశారు.


లిరిక్ రైటర్స్ గురించి.. ?
కాసర్ల శ్యామ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, శర్మగారు అందరూ చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. ప్రతి పాటకు చాలా ఎక్సర్సైజ్ చేశారు. సంస్కృతంలో చాలా హై స్టాండర్డ్స్ లో లిరిక్స్ రాశారు.
ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన కొత్త వాయిస్ లని పరిచయం చేశారు  ?
అవునండి. సర్వేపల్లి సిస్టర్స్, సుబ్బలక్ష్మి గారి మనవరాలు, కనకవ్వ ఇలా చాలా ఫ్రెష్ వాయిస్ లు మీకు వినిపించాయి. నిజానికి ఈ కథకు అలాంటి ఒక కొత్తదనం కావాలి. ఎందుకంటే అఖండ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఆడియన్స్ కి అవగాహన ఉంది. దీంతో తాండవానికి వచ్చేసరికి ఎక్స్పరిమెంట్ కూడా చేశాం.
సినిమా మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది.. ?
అఖండ నాకు లైఫ్ లో బ్యాలెన్స్ ఇచ్చింది. మనం గుడికి వెళ్తే ఒక బ్యాలెన్స్ వస్తుంది కదా. అలాంటి మనశ్శాంతి తో పాటు రెస్పాన్సిబిలిటీని కూడా పెంచింది.


సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది కదా.. అప్పుడు ఎలా ఫీల‌య్యారు ?
- నిజానికి నాకు అది షాకింగ్. ఎందుకంటే ఎవరూ కూడా ఊహించలేదు. అయితే మా బాధంతా అభిమానుల గురించే. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి థియేటర్స్ ని ముస్తాబు చేసి ప్రీమియర్స్ కి రెడీగా ఉన్నారు. చివరి నిమిషంలో వాయిదాతో వారు నిరాశ వెనుతిరగడం బాధించింది. మేము సినిమా పరంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అది ఎప్పుడు రిలీజ్ అయిన దాని బలం దానికి ఉంటుందని గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఈరోజు నిజమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: